Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి

మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి

📰 Generate e-Paper Clip

మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి – సువేందు సంచలన ఉత్తర్వులు..!!

 

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ల అమలు కోసం వరుసగా నిర్ణయాలు ప్రకటిస్తున్న సీఎం సువేందు అధికారి..

 

మరో కీలక అంశం పైన ఉత్తర్వులు జారీ చేసారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మతపరమైన పథకాలను నిలిపి వేస్తూ నిర్ణయించారు. ఇక.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు.. ప్రభుత్వ ఏయిడెడ్ ఉన్న మదర్సాలల్లో ఇక నుంచి వందేమాతరం ఆలాపన తప్పనసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. పశ్చిమ బెంగాల్‌లోని సువేందు అధికారి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ సహాయం..గుర్తింపు పొందిన అన్ని మదర్సాలలో తరగతులు ప్రారంభమయ్యే ముందు “వందేమాతరం” గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, ప్రతి మదర్సాలో ప్రార్థన సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం ఇకపై తప్పనిసరి అమలు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు అధికారిక ప్రకటన విడుదల చేశారు. విద్యా సంస్థల్లో జాతీయ భావనను పెంపొందించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం నుంచి సాయం అందుకుంటున్న ప్రతీ సంస్థ ఈ విధానం పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

 

సువేందు వరుస నిర్ణయాలతో

 

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గుర్తింపు పొందిన మదర్సాలలో కూడా అసెంబ్లీ సమయంలో వందేమాతరం పాడటం ఇకపై విధిగా మారుతుంది. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో, సంతాలి భాషా పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరి అయినప్పుడు, మదర్సాలలో దానిని అమలు చేయడంలో అభ్యంతరం ఎందుకు ఉండాలని మంత్రి ఖుదీరామ్ టుడు ప్రశ్నించారు. విద్యార్థులలో చిన్నతనం నుండే క్రమశిక్షణతో పాటు దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి ఈ ఉత్తర్వులు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక.. ఈ నిర్ణయం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి కొందరు ప్రభుత్వ నిర్ణయం పైన భిన్నవాదన వినిపిస్తున్నారు. కాగా.. విద్యా సంస్థలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం లో భాగంగానే ఈ ఉత్తర్వులను తీసుకొచ్చినట్లుగా బీజేపీ నేతలు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular