వెల్దుర్తి మండలంలో పులికుంట చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది
వెల్దుర్తి, మే 22, (సీమకిరణం న్యూస్) :

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో, జలధార జలహారతి పనులు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు పులికుంట చెరువు (పీఆర్ ట్యాంక్) పునరుద్ధరణ పనులు శుక్రవారం బ్రహ్మగుండం దేవాలయం సమీపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎక్స్‌కవేటర్ XCMG–210 యంత్రంతో చెరువు తవ్వక పనులను ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాలు కూడా అభివృద్ధి చెందుతాయని అధికారులు తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఈ చంద్రశేఖర్, ఏఈ హరికృష్ణ మరియు ఎంపీడీవో చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్, సీనియర్ నాయకుడు జ్ఞానేశ్వర్ గౌడ్, మండల టిడిపి అధ్యక్షుడు బలరాం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రమాకాంత్ రెడ్డి, చిన్న గోపాల్ గౌడ్,బోయరామచంద్రుడు పార్టీ కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామాభివృద్ధి మరియు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.

