Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి

టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి

📰 Generate e-Paper Clip

జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ లను పూర్తిగా నివారించాలి

 

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

 

కర్నూలు ప్రతినిధి , మే 22, (సీమకిరణం న్యూస్) :

 

జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాల నివారణ పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా బాల్యవివాహాలు,టీనేజీ ప్రెగ్నెన్సీ లు నమోదు అవుతున్నాయని, వీటిపై నిరంతరం నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ మహిళా పోలీస్ , ఏఎన్ఎం, ఆశ సిబ్బంది వారి పరిధిలో కౌమార దశలో ఉన్న బాలికలను, వారి తల్లిదండ్రులతోనూ సంప్రదిస్తూ బాల్య వివాహాలు చేయకుండా, టీనేజ్ గర్భం దాల్చకుండా వారికి సరైన సూచనలు చేయాలని,ఇందువల్ల జరిగే దుష్పరిణామాలను వివరించాలని ఆదేశించారు. అమ్మాయిలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన జరిగే నష్టాలను, ఇబ్బందులను కర్నూలు జిల్లా వైద్య విద్యార్థినుల ద్వారా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్వో ను, ఫోన్ ద్వారా కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ ను ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా, టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదు కాకుండా చైతన్యం తీసుకు వచ్చేలా కళాజాత బృందాలను, బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార రధము, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఐసిడిఎస్ పిడి విజయ ను ఆదేశించారు. ఈ సమావేశంలో కర్నూలు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు , డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా , డిఎం హెచ్ ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ , ఐ సి డి ఎస్ పిడి విజయ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular