Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తల్లికి వందనం నిధులు విడుదల : 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..

తల్లికి వందనం నిధులు విడుదల : 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..

📰 Generate e-Paper Clip

తల్లికి వందనం నిధులు విడుదల : 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..

 

అమరావతి, జూలై 22, (సీమకిరణం న్యూస్):

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద నేడు నిధులు విడుదల కానున్నాయి.అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు దశల వారీగా ఈ ఆర్థిక సాయం జమ చేయనున్నారు. కుటుంబంలోచదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఈ పథకంవర్తింపజేస్తున్నారు.ఈ విద్యా సంవత్సరంలో ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 67.47 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.వీరికి సంబంధించి 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,120.78 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ నగదు జమ ప్రక్రియ 24వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular