Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అ'పూర్వ స్నేహ సమ్మేళనం'

అ’పూర్వ స్నేహ సమ్మేళనం’

📰 Generate e-Paper Clip

25 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

 

కర్నూలు ప్రతినిధి, మే 23, (సీమకిరణం న్యూస్):

 

సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాల స్నేహ సమ్మేళనం శనివారం కర్నూలులోని ది సైన్ రీజెన్సీ హోటల్ లో అత్యంత ఘనంగా మరియు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు హాజరై తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్ననాటి స్నేహితులను 25 సంవత్సరాల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం అందరిలో ఆనందోత్సాహాలను నింపింది. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. పాఠశాల రోజుల అనుభవాలు, సరదా సంఘటనలు, జ్ఞాపకాలను పంచుకుంటూ పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, స్నేహపూర్వక సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ స్నేహ సమ్మేళనం పాత అనుబంధాలను మరింత బలపరచడమే కాకుండా, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహక కమిటీ సభ్యులకు పాల్గొన్నవారు అభినందనలు తెలిపారు. “25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన ఈ అరుదైన క్షణాలు జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి” అని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular