బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించండి
బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సీఐ, ఎస్సై ఎమ్. నరేష్
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి : సీఐ
వెల్దుర్తి, ఫిబ్రవరి 09, (సీమకిరణం న్యూస్) :
వెల్దుర్తి మండలంలోని బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిబ్బంది, ప్రజలు సహకరించాలని వెల్దుర్తి సర్కిల్ సిఐ యుగంధర్, ఎస్సై నరేష్ తెలిపారు. సోమవారం బ్రహ్మగుండంలోని కామేశ్వరి సమేతేశ్వర స్వామి ఆలయంలో వెల్దుర్తి సర్కిల్ సిఐ యుగంధర్, ఎస్సై నరేష్ తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం సీఐ యుగంధర్ మాట్లాడుతూ బ్రహ్మగుండంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడికి విచ్చేసి భక్తులకు కోనేరు దగ్గర స్నానపు గదులు, భక్తులు చిరు వ్యాపారస్తులకు ఎలాంటి అసౌకర్యము కలుగకుండగా శాంతిభద్రతలు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రక్షణ మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకై అలాగే దేవాలయంలో క్యూలైన్ గురించి మరియు కోనేరు దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అసౌకర్యం కలుగకుండా టెంపుల్ ఈవో , సీఐ యుగంధర్, ఎస్సై ఎమ్. నరేష్ బ్రహ్మగుండం సందర్శించి తగు ఏర్పాటు చేశారు.

