Friday, July 24, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్గన్‌తో కాల్చుకుని.. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

గన్‌తో కాల్చుకుని.. త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య

 

త్రిపుర, జూలై 20, (సీమకిరణం న్యూస్):

 

రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వహిస్తున్న అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్రిపుర రాష్ట్రంలో సోమవారం ఉదయం ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకొని ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అగర్తలాలోని జీబీ ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి ఇలా ఆకస్మికంగా, విషాదకర రీతిలో మరణించడం త్రిపుర పరిపాలన, శాంతిభద్రతల వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించడంతో. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్యకు గల తక్షణ కారణాలపై ఆరా తీస్తున్నారు. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి మరణానికి దారితీసిన పరిస్థితులను నిర్ధారించడానికి ప్రభుత్వం త్వరలోనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా త్రిపుర కేడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అనురాగ్ ధంకర్, 2025 మే నెలలో త్రిపుర డీజీపీ బాధ్యతలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular