Wednesday, April 1, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: బ్రిటన్ పీఠంపై తొలి ముస్లిం మహిళ? | UK రాజకీయ సంక్షోభం,...

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: బ్రిటన్ పీఠంపై తొలి ముస్లిం మహిళ? | UK రాజకీయ సంక్షోభం, ఎప్స్టీన్ రో మధ్య షబానా మహమూద్ మొదటి ముస్లిం మహిళ ప్రధాని అవుతారా?

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

ప్రస్తుత బ్రిటన్ రాజకీయాలు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాయి. ఎపిస్టీన్ ఫైల్స్ ప్రకంపనలు ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్‌మర్ కుర్చీని వణికిస్తున్నాయి. ఈ రాజకీయ అస్థిరత మధ్య ఓ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె మరెవరో కాదు శబానా మహమూద్. కీర్ స్టార్‌మర్ ఒక వేళ పదవి నుంచి తప్పుకుంటే బ్రిటన్ తదుపరి అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే బ్రిటన్‌కు ఆమె తొలి ముస్లిం మహిళా అవుతారు.

ఇంతకు ఎవరీ శబానా మహమూద్?
షబానా మెహమూద్ 1980, సెప్టెంబర్ 17న బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని మీర్‌పూర్ ప్రాంతం నుండి బ్రిటన్‌కు వలస వచ్చారు.శబానా మహమూద్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలోని లింకన్ కాలేజ్ నుండి లా పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె ఒక బారిస్టర్. 2010లో బర్మింగ్‌హామ్ లేడీవుడ్ సీటు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళా ఎంపీలలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ హోమ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె ‘లార్డ్ ఛాన్సలర్’, న్యాయ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

UK రాజకీయ సంక్షోభం ఎప్స్టీన్ రో మధ్య షబానా మహమూద్ మొదటి ముస్లిం మహిళ ప్రధాని అవుతారు

భారత్‌కు కఠినంగా ఆమె కాశ్మీర్ వైఖరి
శబానా మెహమూద్ ప్రధాని కావడం భారత్-బ్రిటన్ దౌత్య సంబంధాలకు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. ఆమె కాశ్మీరీ మూలాల కారణంగా భారత్ అనుసరిస్తున్న విధానాలపై గతంలో అనేకసార్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు, ఆమె లండన్‌లోని భారత హైకమిషన్ ముందు జరిగిన నిరసనల్లో చురుగ్గా ఉంది. దీన్ని ఆమె “కాశ్మీరీలకు జరిగిన ద్రోహం”గా అభివర్ణించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బ్రిటన్ పార్లమెంటులో పలుమార్లు గళమెత్తారు. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హోమ్ సెక్రటరీగా ఆమె వలసల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడానికి ఆమె వాదిస్తున్నారు, దీనివల్ల బ్రిటన్‌కు వెళ్లే భారతీయ విద్యార్థులు, నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

స్టార్మర్ సంక్షోభానికి కారణమైన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’
ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్‌మర్ కష్టాల్లో పడటానికి కారణం ఆయన సన్నిహితుడు పీటర్ మాండెల్సన్. వారి నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో మాండెల్సన్‌కు సంబంధాలు బయటపడటంతో బ్రిటన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. దీనికి బాధ్యత వహిస్తూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మాక్‌స్వీనీ ఫిబ్రవరి 8న రాజీనామా చేశారు. ఈన్నీ పరిణామాలు శబానా మహమూద్‌కు మార్గం సుగమం అవుతున్నాయి.

భారత్ వైఖరి ఏంటి?
భారత సంతతికి చెందిన రిషి సునక్ హయాంలో భారత్-బ్రిటన్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. కానీ షబానా మహమూద్ ప్రధాని అయితే పరిస్థితి కొంత మేరకు మారవచ్చు. అయితే, ఒక వ్యక్తిగత అభిప్రాయాల కంటే ‘జాతీయ ప్రయోజనాలే’ ముఖ్యం కాబట్టి, ప్రధాని అయ్యాక ఆమె తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular