Tuesday, May 26, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకల్తీ నెయ్యిపై తేల్చేసిన ఉండవల్లి..! జైల్లో అంబటితో భేటీ..! | జైల్లో అంబటి రాంబాబును కలిసిన...

కల్తీ నెయ్యిపై తేల్చేసిన ఉండవల్లి..! జైల్లో అంబటితో భేటీ..! | జైల్లో అంబటి రాంబాబును కలిసిన తర్వాత నెయ్యి కల్తీ వివాదంపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) ప్రముఖ వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు తర్వాత రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత అంబటి రాంబాబును ఆయన ఇవాళ ములాఖత్ లో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెయ్యి కల్తీ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచీ తనకు పరిచయమని ఉండవల్లి చెప్పారు. వ్యక్తిగత పరిచయంతోనే ములాఖాత్ కు వచ్చానని. చంద్రబాబు కొత్త ఒరవడి పెట్ట మొదలు పెట్టారు, తిట్టిన వాళ్లకి రాజమండ్రి సెంట్రల్ జైలు, కొట్టిన వాళ్లకి స్టేషన్ బెయిలు ఇస్తున్నారు. ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదన్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీపై జరుగుతున్న రచ్చ, చంద్రబాబు వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించారు.

జైల్లో అంబటి రాంబాబును కలిసిన తర్వాత నెయ్యి కల్తీ వివాదంపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

తిరుమల నెయ్యిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువని సిట్ నివేదిక 20వ పేజీలో స్పష్టంగా ప్రకటించారని ఉండవల్లి.
కానీ చంద్రబాబు పదేపదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారు. టాయిలెట్స్ కడిగే లిక్విడ్ అని కూడా అంటున్నాం. తిరుపతి ప్రసాదం గురించి సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు.చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పి మాట్లాడరని, కానీ లడ్డూ విషయం లో ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు తిరుమలకు. సీఎం చంద్రబాబు దైవ ద్రోహం చేసిన వ్యాఖ్యలు. బీజేపీ వాళ్లు కూడా చంద్రబాబులా మాట్లాడటం. ఈ విషయంపై ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచించాలని ఉండవల్లి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular