Saturday, March 7, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి : డాక్టర్. శంకర్ శర్మ

జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి : డాక్టర్. శంకర్ శర్మ

📰 Generate e-Paper Clip

జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి : డాక్టర్. శంకర్ శర్మ

కర్నూలు వైద్యం, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):

కరాటే జాతీయ స్థాయి పోటీలు ఈనెల 7,8 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈపోటీల్లో కర్నూలు జిల్లా నుంచి 30 మంది కరాటే క్రీడాకారులు పాల్గొంటున్నారు. విశాఖపట్నం వెళ్తున్న క్రీడాకారులకు సహస్ర పాఠశాల ఆవరణలో కరాటే (కుంటీ) కిట్ లను డాక్టర్. శంకర్ శర్మ అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్న వారికి ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారన్నారు. మార్షల్ ఆర్ట్స్ లో వ్యాయామం, యోగా, ప్రాణాయామం ఉన్నందున ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రస్తుతం ఊబకాయంతో చాలా మంది భాదపడుతున్నారని కరాటే శిక్షణ తీసుకుంటే ఊబకాయ సమస్యలు దరిచేరవని డాక్టర్. శంకర్ శర్మ తెలియజేశారు. విశాఖపట్నం లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారులు రాణించాలని కోరారు. శిక్షకులు మహావీర్, బహాద్దూర్, మధుభరత్, సహస్ర స్కూల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular