Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం 

జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం 

📰 Generate e-Paper Clip

జగన్నాథగట్టు జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం 

 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ 

 

కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్) : 

 

ది కర్నూల్ డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో అప్ రేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ జనరల్ సెక్రటర్ ఎస్.కే మహేష్, జాయింట్ సెక్రటరీ కె.హరినాథ్ రెడ్డి, సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బయ్య, శ్రీకాంత్ తదితరులు బుధవారం రాత్రి కర్నూలు నగరంలోని తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రం అందజేశారు. 2009లో ప్రభుత్వం కేటాయించిన జగన్నాథ్ గట్టు మీద ఇంటి స్థలాలు నిర్ణీత ధరను చెల్లించి జర్నలిస్ట్ సోదరులు కొనడం జరిగింది. తరువాత వివిధ అంతర్గత విభేదాలు కారణాల వల్ల దీనికి శ్రమించిన ముఖ్య జర్నలిస్ట్ నేత అధ్యక్షులు కృపావరం ఆకస్మిక మృతి చెందారు. మట్టి మాఫియా ఎర్రమట్టి తవ్వకాలు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాట్స్ లేఅవుట్ కూడా అనుమతులతో అన్ని విధాలుగా హక్కులు కలిగి ఉన్న కూడా ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్త్వాలు మారాయి, అధికారులు మారారు కానీ జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యలు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈ విషయంలో సొసైటీకి క్లియర్ గా వచ్చిన హై కోర్టు ఆదేశాలు కూడా అమలు కానీ పరిస్థితి. ఇవన్నీ మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసికెళ్లి డాక్యుమెంట్స్ తో పాటు వివరించడం జరిగింది. అందులకు మంత్రి టీ జీ భరత్ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా సమస్యలు త్వరితీగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. త్వరలో జర్నలిస్టుల సమస్యకు పరిష్కారం మంత్రి టీ జీ భరత్ ద్వారా తీరుతుందని ఆసిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular