Tuesday, March 3, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కోవూరు లో తాళం వేసిన ఇంటిలో భారీ చోరీ

కోవూరు లో తాళం వేసిన ఇంటిలో భారీ చోరీ

📰 Generate e-Paper Clip

*నెల్లూరు జిల్లా..కోవూరు*

 

*💥కోవూరు లో తాళం వేసిన ఇంటిలో భారీ చోరీ.. విలువచేసే సొత్తు కొల్లగొట్టిన దొంగలు*💥

 

ఆలస్యంగా తెలిసిన సమాచారం మేరకు రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగులగొట్టి 472 గ్రాముల బంగారు. ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి, రూ.2.30 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారు. పట్టణంలోని గొల్లవీధిలో నివాసం ఉంటున్న కొప్పోలు సుధాకర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దుండగులు, తాళం పగులగొట్టి బీరువాలోని ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, కోవూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular