Thursday, October 22, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులపై సమీక్ష

 

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

 

కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 17 (సీమకిరణం న్యూస్) :

 

 

లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ద్వారా అందిస్తున్న న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి. లీలా వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు శనివారం కర్నూలు కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు, బాధితులకు అందించే చట్టపరమైన సలహాలు, జైళ్ల సందర్శనలు, కేసుల వివరాల పరిశీలన, కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. న్యాయ సహాయం అవసరమైన వారికి సకాలంలో తగిన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయా కేసుల్లో ఎన్ని బెయిళ్లు మంజూరయ్యాయి, ప్రస్తుతం కేసుల స్థితిగతులు ఏమిటి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ చంద్రరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏ. సులోచన, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular