Thursday, October 22, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి

కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి

📰 Generate e-Paper Clip

కలెక్టర్ ఫొటోతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి

 

9713588183 నంబర్ నుంచి వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

 

సైబర్ మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు

 

నంద్యాల ప్రతినిధి, అక్టోబర్ 22, (సీమకిరణం న్యూస్) :

 

జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ప్రొఫైల్ ఫొటోను దుర్వినియోగం చేస్తూ డబ్బులు డిమాండ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ ఫొటోతో 9713588183 నంబర్ నుంచి డబ్బులు కోరుతూ సందేశాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటువంటి సందేశాలను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని, సంబంధిత నంబర్‌ను బ్లాక్ చేసి, ఆధారాలతో పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు. విచారణలో సైబర్ మోసం నిర్ధారణ అయితే బాధ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్రమత్తంగా ఉండండి.. సైబర్ మోసాలకు గురికాకండి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular