డేటింగ్ యాప్స్‌లో మోసాల వల.. తియ్యటి మాటలకు మోసపోవద్దు!
పరిచయం పేరుతో నమ్మకం సంపాదించి డబ్బులు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు..
అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని హెచ్చరిక.
తెలంగాణ, జూలై 20, (సీమకిరణం న్యూస్):
డేటింగ్ యాప్స్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తియ్యటి మాటలతో స్నేహం పెంచుకుని, ప్రేమ పేరుతో నమ్మకం సంపాదించిన తర్వాత పెట్టుబడులు, గిఫ్ట్‌లు లేదా అత్యవసర అవసరాల పేరుతో డబ్బులు కాజేస్తున్నారు. మొదట చిన్న మొత్తాల్లో లాభాలు చూపించి, ఆ తర్వాత భారీగా డబ్బులు పెట్టించేలా ప్రలోభపెట్టి చివరికి బాధితులను మోసం చేస్తున్నారు. కాబట్టి డేటింగ్ యాప్స్‌లో అపరిచితులను గుడ్డిగా నమ్మకుండా, వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంకు వివరాలు పంచుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

