Sunday, June 21, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ

ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ

📰 Generate e-Paper Clip

రూ.40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లక్ష్మీనాథ్

 

వెల్దుర్తి, జూన్ 16,(సీమకిరణం న్యూస్):

 

వెల్దుర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. మంగళవారం వెల్దుర్తిలోని నేషనల్ హైవే సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రాప్ ఆపరేషన్‌లో పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. లంచాలు డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలు నిర్భయంగా ఏసీబీని ఆశ్రయించాలని డీఎస్పీ సోమన్న సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular