Sunday, June 21, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నూతన చైర్మన్ మునీర్ భాషను సన్మానించిన అమీన్ పీర్ శిష్యులు

నూతన చైర్మన్ మునీర్ భాషను సన్మానించిన అమీన్ పీర్ శిష్యులు

📰 Generate e-Paper Clip

నెల్లూరు సిటీ, జూన్ 18, (సీమకిరణం న్యూస్):

 

నెల్లూరులోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి ప్రతీక అయిన బరాషహీద్ దర్గా రొట్టెల పండుగ మరియు గంధ మహోత్సవం 2026 నూతన చైర్మన్‌గా నియమితులైన షేక్ మునీర్ భాషకు అభినందనలు, సన్మానాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం బారా షాహిద్ దర్గా ప్రాంగణంలో కోటమిట్టకు చెందిన కడప అమీన్ పీర్ స్వామి వారి శిష్యులు నూతన చైర్మన్ షేక్ మునీర్ భాషను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అమీన్ పీర్ శిష్యులు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ మైనారిటీ ప్రతినిధిగా, క్రియాశీలక నాయకుడిగా ఉన్న షేక్ మునీర్ భాషకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రొట్టెల పండుగ నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ రొట్టెల మహోత్సవాన్ని, గంధోత్సవాన్ని మునీర్ భాష తన నాయకత్వంలో దిగ్విజయంగా, అత్యంత వైభవంగా పూర్తి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మైనార్టీ ప్రముఖులు, నాయకులు సయ్యద్ సమీ హుసేనితో పాటు పలువురు భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular