ఏసీబీ వలలో వెల్దుర్తి పంచాయతీ సెక్రటరీ

రూ.40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లక్ష్మీనాథ్   వెల్దుర్తి, జూన్ 16,(సీమకిరణం న్యూస్):   వెల్దుర్తి గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. మంగళవారం వెల్దుర్తిలోని నేషనల్ హైవే సమీపంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.40 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రాప్ ఆపరేషన్‌లో...