Sunday, June 21, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు ఘన వీడ్కోలు

తిరుపతి అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

తిరుపతి అడిషనల్ ఎస్పీగా బదిలీపై వెళ్తున్న జె. బాబు ప్రసాద్‌కు ఘన వీడ్కోలు

 

కర్నూలు క్రైం, జూన్ 18, (సీమకిరణం న్యూస్) :

 

కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ, అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై తిరుపతి లా అండ్ ఆర్డర్ విభాగంలో బాధ్యతలు చేపట్టబోతున్న జె. బాబు ప్రసాద్ గారికి కర్నూలులో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కర్నూల్ నగరంలోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌కు చెందిన టీజీవీ కళ్యాణ మండపంలో గురువారం రాత్రి ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

 

పూలమాలలు, శాలువాతో ఘన సన్మానం : 

 

ఈ వీడ్కోలు సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ , మరియు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న అడిషనల్ ఎస్పీ జె. బాబు ప్రసాద్ ని వారు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

 

సమర్థవంతమైన అధికారి : డీఐజీ, ఎస్పీ

 

ఈ సందర్భంగా డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారులు మాట్లాడుతూ జె. బాబు ప్రసాద్ కర్నూలు జిల్లాలో అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీగా శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, తిరుపతి లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీగా కూడా ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

 

హాజరైన పోలీస్ ఉన్నతాధికారులు : 

 

ఈ వీడ్కోలు వేడుకలో సదరన్ రీజియన్ హోంగార్డ్ కమాండెంట్ మహేశ్ కుమార్, అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణ మోహన్ లతో పాటు జిల్లాకు చెందిన పలువురు డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, మరియు ఎస్సైలు పాల్గొని బాబు ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular