Monday, June 15, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. రాఘవేంద్ర

కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. రాఘవేంద్ర

📰 Generate e-Paper Clip

కర్నూలు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.వి. రాఘవేంద్ర

 

కర్నూలు క్రైమ్, జూన్ 13 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు సబ్‌డివిజన్ డీఎస్పీగా కె.వి. రాఘవేంద్ర శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు కర్నూలు డీఎస్పీగా విధులు నిర్వహించిన జె. బాబు ప్రసాద్ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది, ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో కె.వి. రాఘవేంద్ర నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా స్వస్థలమైన కె.వి. రాఘవేంద్ర నవంబర్ 1996లో ఎస్సైగా పోలీసు శాఖలో సేవలను ప్రారంభించారు. అనంతరం జూలై 2010లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా పదోన్నతి పొందారు. ఇటీవల మే 1, 2026న డీఎస్పీగా పదోన్నతి పొందిన ఆయనకు కర్నూలు సబ్‌డివిజన్ తొలి పోస్టింగ్‌గా లభించింది. ఎస్సైగా, సీఐగా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన కె.వి. రాఘవేంద్ర, డీఎస్పీ హోదాలో తొలిసారిగా కర్నూలు జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు సబ్‌డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నేరరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular