Sunday, June 21, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆత్మకూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ‘SIR’ సర్వే

ఆత్మకూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ‘SIR’ సర్వే

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు నియోజకవర్గంలో పారదర్శకంగా ‘SIR’ సర్వే 

 

ఆత్మకూరు ఆర్డీవో బి. పావని

 

 

నెల్లూరు /ఆత్మకూరు, జూన్ 18, (సీమకిరణం న్యూస్) :

 

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ‘SIR’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ఆత్మకూరు ఆర్డీవో బి. పావని వెల్లడించారు. నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు, బూత్ లెవెల్ అధికారుల (BLOs) విధులు మరియు సర్వే పురోగతిని గురువారం ఆమె మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఈనెల 15వ తేదీ నుండి డిక్లరేషన్ ఫారాల పంపిణీ మరియు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే నెల (జూలై) 14వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురిస్తామని స్పష్టం చేశారు.

 

నియోజకవర్గ సర్వే వివరాలు:

 

మండలాలు: ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 6 మండలాలు.

మొత్తం ఓటర్లు: 2,17,309 మంది.

పోలింగ్ కేంద్రాలు: 278 కేంద్రాలు.

బీఎల్ఓల సంఖ్య: సర్వే కోసం 278 మంది బి.ఎల్.ఓలను నియమించారు.

 

ఓటర్లు సహకరించాలి : ఆర్డీవో బి. పావని

 

నియమితులైన 278 మంది బీఎల్ఓలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వేగంగా సర్వే పూర్తి చేస్తారని ఆర్డీవో వివరించారు. ఇంటింటి సర్వేకు వచ్చే ఎన్నికల సిబ్బందికి ఓటర్లు తమ సరైన సమాచారాన్ని అందించి, ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆర్డీవో బి. పావని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular