Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్మహిళల భద్రత మనందరి బాధ్యత : కర్నూలు జిల్లా ఎస్పీ

మహిళల భద్రత మనందరి బాధ్యత : కర్నూలు జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

మహిళల భద్రత మనందరి బాధ్యత 

 

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

 

ఎమ్మిగనూరు వెంకటాపురం కాలనీలో “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన కార్యక్రమం

 

 

మహిళల రక్షణ కోసం “శక్తి యాప్” వినియోగించుకోవాలి

 

చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయి

 

కర్నూలు క్రైమ్/ ఎమ్మిగనూరు ప్రతినిధి, మే 20, (సీమకిరణం న్యూస్):

మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల రక్షణ మరియు సైబర్ నేరాల పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో శ్రీ గుంటెప్ప స్వామి దేవాలయం దగ్గర బుధవారం “మీ రక్షణ – మా బాధ్యత” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు, సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో లేదా సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న “శక్తి యాప్” వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, 100, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు , మహిళల చట్టాల ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యలుంటే పోలీసులకు చేరవేయాలన్నారు. బాల్య వివాహాలు చేయకూడదన్నారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు లేదా మహిళలపై వేధింపులు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కె. గంగి రెడ్డి , తహసీల్దార్ శ్రీనివాసులు , ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నరసింహులు , టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మహేష్ ,ఎస్సైలు, గ్రామ మరియు వార్డు సచివాలయ మహిళా పోలీసులు, పోదుపు సంఘాల మహిళలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular