70 రైతు కుటుంబాలకు భారీ ఊరట!
22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి
యాపార్లపాడు రైతుల ఏళ్లనాటి భూసమస్యకు పరిష్కారం..
ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి చేతుల మీదుగా నేడు ఉత్తర్వుల అందజేత
కల్లూరు, ఆగస్టు 11 (సీమకిరణం న్యూస్):

యాపార్లపాడు గ్రామానికి చెందిన 70 రైతు కుటుంబాలకు భారీ ఊరట లభించింది. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న వారి భూములను ఆ జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏళ్లుగా భూముల హక్కులు, క్రయవిక్రయాలకు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తెరపడే అవకాశం ఏర్పడింది. ఈ ఉత్తర్వులను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేయనున్నట్లు కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. బుధవారం (ఆగస్టు 12) ఉదయం 10.30 గంటలకు కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 22-ఏ జాబితా నుంచి భూముల తొలగింపుతో రైతులకు తమ భూములపై హక్కులు మరింత స్పష్టమవడంతో పాటు, భూముల లావాదేవీల విషయంలో ఉన్న అవరోధాలు తొలగనున్నాయని కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

