డోన్ ఐటీఐ నూతన ప్రిన్సిపల్‌గా నాగ కేశాలు
డోన్, ఆగస్టు 11, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా నాగ కేశాలు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన ప్రసాద్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాగ కేశాలను ఎఫ్ఏసీ (FAC)గా నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగ కేశాలను కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దెల శ్రీధర్ పాల్గొని నాగ కేశాలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగ కేశాలు మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో విద్యార్థులకు మెరుగైన శిక్షణ, వసతులు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

