Sunday, August 23, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఏఎస్ పేట ఎస్సై జిలానికి ఉత్తమ అధికారి అవార్డు

ఏఎస్ పేట ఎస్సై జిలానికి ఉత్తమ అధికారి అవార్డు

📰 Generate e-Paper Clip

ఏఎస్ పేట ఎస్సై జిలానికి ఉత్తమ అధికారి అవార్డు

 

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఆగస్టు 16, (సీమకిరణం న్యూస్):

 

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఏఎస్ పేట ఎస్సై జిలానిని ఉత్తమ అధికారిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేతుల మీదుగా ఎస్సై జిలాని ఉత్తమ అధికారి అవార్డును అందుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఈ అవార్డు లభించింది.  ఎస్సై జిలానికి వరుసగా ఇది మూడవసారి ఉత్తమ అధికారి అవార్డు రావడం విశేషం. వరుసగా మూడు అవార్డులు అందుకోవడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎస్సై జిలానిని అభినందించారు. విధి నిర్వహణలో మరింత అంకితభావంతో పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎస్సై జిలాని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular