Sunday, April 19, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

📰 Generate e-Paper Clip

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

 

తప్పుడు ప్రచారాలను, వదంతులను ఎవరు నమ్మవద్దు

 

కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్

 

కర్నూలు క్రైమ్ ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు పట్టణంలోని స్ధానిక బి. క్యాంపులో పిల్లలను తీసుకెళ్ళే వాడు దొరికాడు అని సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలను చూసి ప్ర‌జ‌లు బ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదని కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. అతడు ఒరిస్సాకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తిగా కర్నూలు త్రీ టౌన్ పోలీసులు గుర్తు చేసి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పడు సమాచారం చూసి ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ఉండాలని కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైన ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular