ప్రజల కోసం ఆగని ఆర్టీసీ బస్సులు…చర్యలు తీసుకోని అధికారులు..?
తీరు మార్చుకొని ఆర్టీసీ డ్రైవర్లు…?
పట్టించుకోని అధికారులు..?
సత్తెనపల్లి, జూలై 27, (సీమకిరణం న్యూస్) :-
ఆర్టీసీ బస్సులు నడిచేది ప్రజల కోసం, డ్రైవర్ కి కండక్టర్ కి జీతాలు ఇచ్చేది ప్రజలు ఇచ్చిన టికెట్ డబ్బులతోనే, అది మరిచిపోయి ప్రజలను చిన్నచూపుగా చూస్తున్నా ఆర్టిసి ఉద్యోగులు. సోమవారం ఉదయం సత్తెనపల్లి నుండి అమరావతి వెళ్తున్న ఏపీ 07టిహచ్ 2499 పల్లె వెలుగు బస్ కాశిపాడు 7:50 గం కి స్టాప్ ఉన్న అక్కడ విద్యార్థులు మరియు ఆడవారు, మగవారు, ముసలివారు బస్ కోసం ఎదురుచూస్తున్న ఆపకుండా వెళ్లిపోయిన పల్లె వెలుగు బస్. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఒకప్పుడు ఆర్టీసీ అంటే ఎంతో భరోసాన్ని నమ్మకం ఉండేది. “చెయ్ ఎత్తండి బస్సు ఆగుతుంది” అనే వాక్యాలు పాతకాల బస్సులు మీరు చూసే ఉంటాం. కానీ ఇప్పుడు చెయ్యి ఎత్తడమే కాదు ఎంతమంది ప్రజలు, పిల్లలు, పెద్దవారు, ముసలివారు ఆడవారు బస్సు కోసం ఎదురుచూస్తున్న బస్సు ఆపే దాఖలు కనబడలేదు. ఈ ఆగడాలు రోజురోజుకు మరింత పెరుగుతూ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు సమయానికి ఇంటికి, ఊరికి, పనికి, విద్యార్థులు స్కూలుకి, కాలేజీలకి వెళ్లలేకపోతున్నారు. డ్రైవర్లు మరియు కండక్టర్లు కావాలని చేస్తున్నారా, లేకపోతే డిపో మేనేజర్లు చెప్పడం వల్ల చేస్తున్నారా. ఉచిత బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళలను ఎక్కించుకోకుండా బస్సులు ఆపకుండా చేయడం జరుగుతుందని, గంటలు తరబడి బస్సు కోసం ఎదురుచూడాల్సి వస్తుందని, ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బస్టాండ్ లో ఉన్నప్పటికీ ఎక్కువగా ఉమ్మడి గుంటూరు జిల్లా మరియు పల్నాడు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ఉన్నత అధికారులు మేలుకొని ఆర్టీసీ ఉద్యోగస్తులు వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, ఆర్టీసీ ఉద్యోగస్తులకు తగిన సూచనలు ఇవ్వాలని. సూచనలు పాటించని ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

