Monday, September 14, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్గూడూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

గూడూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

గూడూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

 

 

ప్రశాంత వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలి : ఎస్సై బి. రాజా కుళ్లాయప్ప

 

 

గూడూరు, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్):

 

 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా గూడూరు మండల ప్రజలకు గూడూరు ఎస్సై బి. రాజా కుళ్లాయప్ప హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పోలీసులకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను నిర్వహించాలని ఎస్సై బి. రాజా కుళ్లాయప్ప కోరారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో గూడూరు మండల ప్రజల కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సమృద్ధి వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular