నంద్యాల అదనపు ఎస్పీ ఖాదర్ బాషాను కలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్.కే నజీర్
నంద్యాల అదనపు ఎస్పీ ఖాదర్ బాషాతో సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్, నౌషాద్ మర్యాదపూర్వక భేటీ
నంద్యాల క్రైమ్, జూలై 27, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషా ను సీనియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్ మరియు ఆయన మిత్రుడు నౌషాద్ భాషా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్రికా రంగం, శాంతి భద్రతలు, ప్రజలకు ఖచ్చితమైన సమాచారాన్ని చేరవేయడంలో మీడియా పాత్ర వంటి పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు శాఖ, మీడియా పరస్పర సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నంద్యాల అదనపు ఎస్పీ ఎస్. ఖాదర్ బాషకు సినియర్ జర్నలిస్ట్ ఎస్‌కే నజీర్ శుభాకాంక్షలు తెలిపారు.

