Sunday, September 13, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : మంత్రి టి.జి. భరత్ గుప్తా

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు : మంత్రి టి.జి. భరత్ గుప్తా

📰 Generate e-Paper Clip

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 13, (సీమకిరణం న్యూస్) :

 

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా  జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుడి దయతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక (పర్యావరణహిత) విగ్రహాలనే ప్రతిష్టించి, పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular