Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రికవరీ

చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రికవరీ

📰 Generate e-Paper Clip

చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ రికవరీ

కర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 08, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన రూ.4.50 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ జీటీ 650 సీసీ బైక్‌ను పోలీసులు రికవరీ చేసి యజమానికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే… సంతోష్ నగర్ రోడ్ నంబర్-1లో నివాసం ఉంటున్న కురువ తిరుమలేష్ (43), ఫోటోగ్రాఫర్, తన ఇంటి ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ జీటీ (AP 40 KT 7219) 650 సీసీ బైక్‌ను పార్కింగ్ చేసి ఉంచారు. ఈ బైక్ విలువ సుమారు రూ.4,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. గత నెల 29వ తేదీన ఇద్దరు 16 సంవత్సరాల మైనర్ బాలురు బైక్‌ను చోరీ చేసి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ, చోరీకి పాల్పడిన ఇద్దరు మైనర్లను గుర్తించారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టి వారి వద్ద నుంచి చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన బైక్‌ను సంబంధిత యజమాని కురువ తిరుమలేష్‌కు పోలీసులు అప్పగించారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular