డోన్ ఐటీఐ నూతన ప్రిన్సిపల్‌గా నాగ కేశాలు

డోన్ ఐటీఐ నూతన ప్రిన్సిపల్‌గా నాగ కేశాలు    డోన్, ఆగస్టు 11, (సీమకిరణం న్యూస్) :   నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా నాగ కేశాలు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసిన ప్రసాద్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాగ కేశాలను ఎఫ్‌ఏసీ (FAC)గా నియమించారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. నూతన ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగ కేశాలను కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు....