ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావుకు ఘన స్వాగతం
మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఎమ్మార్వో
కర్నూలు ప్రతినిధి , ఆగస్టు 27, (సీమకిరణం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు పర్యటన సందర్భంగా కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్లు లోకాయుక్తను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. అలాగే కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు కూడా లోకాయుక్తను కలిసి పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్యటన కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ మరియు పోలీసు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

