వరదల్లో చిక్కుకున్న ఏపీ ప్రజలను కాపాడండి : సీఎం చంద్రబాబు
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరదల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారి వివరాలను సేకరించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సమాచారం లేదా సహాయం కోసం 011-23384016, 011-23387089 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

