ఆటంకాలు లేకుండా డబుల్ రైల్వే లైన్ పనులు
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
ఈద్గా నుండి చెన్నమ్మ సర్కిల్‌కు రహదారి అనుసంధానం
కల్లూరు, మే 08, (సీమకిరణం న్యూస్):
నగరంలోని ఆనంద్ థియేటర్ సమీపంలో డబుల్ రైల్వే ట్రాక్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. శుక్రవారం ఆయన ఈద్గా వద్ద డబుల్ ట్రాక్ వద్ద చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. పైప్‌లైన్‌లు, కల్వర్టులు, డ్రైనేజీ కాలువల తరలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని మున్సిపల్, ఆర్ & బి, జలవనరుల, విద్యుత్ తదితర శాఖల అధికారులతో కలిసి పనులను చేపట్టాలని సూచించారు. నిర్మాణ సమయంలో ప్రత్యామ్నాయ రహదారి పనులను మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అదేవిధంగా ఈద్గా వద్ద రైల్వే ట్రాక్ పక్కన నుంచి ఇందిరమ్మ కట్ట మీదుగా చెన్నమ్మ సర్కిల్ సమీపంలోని జాతీయ రహదారికి అనుసంధానం చేసే నూతన మార్గ ప్రతిపాదనలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈ కృష్ణలత, రైల్వే, ఆర్ & బి శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

