పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలి
కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి, జూన్ 09, (సీమకిరణం న్యూస్):

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు తక్షణమే తగ్గించాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ డిమాండ్ చేశారు రాష్ట్ర సమితి పిలుపుమేరకు వెల్దుర్తి పాత బస్టాండ్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది పెరిగిన డీజిలు పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర సరుకుల ధరలు వలన సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ పచ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా చమురు సంక్షోభం ఏర్పడిందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని నరేంద్ర మోడీ ప్రభుత్వం వలన రూపాయి విలువ 95 పైసలకు పడిపోయిందని భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని లక్షల కోట్లు విదేశీ ఆర్థికతనం అప్పు తెచ్చి వడ్డీలు కట్టలేక అంబానీ ఆదానిలకు పెట్టుబడుదారులకు దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఈ అప్పులను తీర్చడానికి సామాన్య ప్రజలు పై భారాలు మోపడం సరికాదని అందుకే మన రాష్ట్రంలోని కేజీ దేశంలో నుంచి ఉత్పత్తి అవుతున్న వంట గ్యాసును 90% గుజరాత్ రాష్ట్రానికి తరలిస్తున్నారని ఈ గ్యాస్ మన రాష్ట్రానికి కేటాయిస్తే వంటగ్యాస్ ధర పెరిగే పరిస్థితి ఉండదని తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ సిపిఎం వామపక్షాలు రాస్తారోకోకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల మండల నాయకులు అనిల్ ఆంజనేయులు గురుపాదయ్య.రాముడు. రైతులు బ్రహ్మం సీమోన్. ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

