ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
ఏపీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ (AP బడ్జెట్ 2026) ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 3.32 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో పలు పథకాలు, రంగాలకు నిధుల కేటాయింపులు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో పయ్యావుల తన బడ్జెట్ ప్రసంగంలో పలు అనూహ్య అంశాలను తెరపైకి తెచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు ఉండటం ఇదే తొలిసారి అని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాల చర్యలను బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించిన పయ్యావుల కేశవ్.. అదే సమయంలో గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన చెల్లింపులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్దరణ చర్యలను కూడా ప్రస్తావించారు. అలాగే స్థానిక సంస్థలకు బదలాయించిన నిధులు, అధిక రుణాలపై వడ్డీలను తగ్గించేందుకు జరిపిన సంప్రదింపుల వివరాలను కూడా బడ్జెట్లో పొందినట్లు తెలిపారు.

గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు తెలియచేయడం కోసమే బడ్జెట్ లో ప్రస్తావించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించమని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆర్థికమంత్రి ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో తెలిపారు. ముఖ్యంగా 12.3 శాతంగా ఉన్న వడ్డీని 9 శాతం తగ్గించేలా ఆయా ఆర్థిక సంస్థలను ఒప్పించాం. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల్లో ఇప్పటి వరకు రూ. 43,298 కోట్ల మేర రుణాలకు వడ్డీలు తగ్గించాలని సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ సంప్రదింపుల ఫలితంగా ఏడాదికి రూ.327 కోట్ల మేర ఆదా అయింది. మరో రూ. 1.20 లక్షల కోట్లకు వడ్డీ రేట్లు తగ్గించాలని సంప్రదింపులు కోరుతున్నాయి. ఈ చర్చలు ఫలమిస్తే ఏటా రూ.1658 కోట్లు ఆదా అవుతాయి.

అలాగే గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన బిల్లుల్లో రూ.24,811 కోట్లు చెల్లింపులు జరిపామని ఆర్థికమంతి తెలిపారు. ఆర్థిక కార్యాకలాపాల పునరుద్దరణకు ఇరిగేషన్, కంపెనీ పనుల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రూ. 37030 కోట్లు ఖర్చు చేశామన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీల నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ కమీషన్ నిధులు రూ. 3797 కోట్ల మేర బదలాయించామన్నారు. గత ప్రభుత్వం నిలిపేసిన కేంద్ర ప్రయోజిత పథకాల్లో 85 స్కీంల పునరుద్దరణకు రూ. 18,701 కోట్లు ఖర్చు పెట్టామని, ఫలితంగా నిధుల నుంచి విడుదల మరింతగా పెరిగింది.
-

AP బడ్జెట్ 2026-27 : రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్
-

YS Jagan: అసెంబ్లీకి హాజరుపై జగన్ తాజా నిర్ణయం..! విపక్ష హోదాపైనా..!
-

ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై బడ్జెట్ లో కీలక ప్రకటన..!!
-

బడ్జెట్ లో మహిళలకు నెలకు రూ 1500 పథకం, ఉద్యోగులకు పీఆర్సీ..!?
-

AP Budget 2026: సంపద సృష్టికి కీలక ప్రకటన-చంద్రబాబు కలల ప్రాజెక్ట్..!
-

బడ్జెట్ లో పవన్, లోకేష్ శాఖలకు కేటాయింపులు ఎంతంటే..!!
-

రూ 3.32 లక్షల కోట్ల బడ్జెట్, కొత్త వరాలు – కేటాయింపులు..!!
-

ఏపీ బడ్జెట్, మరో కీలక హామీ అమలు – రూ 3.50 లక్షల కోట్ల అంచనా..!!
-

IIIT: ట్రిపుల్ ఐటీలపై తేల్చేసిన లోకేష్..! అదే క్యాంపస్ లో..!
-

మున్సిపల్ పోరులో ‘హస్తం’ హవా.. బేజారైన విపక్షాలు!
-

సురేఖ వాణి కూతురు చంపేసిందిగా..!
-

కరీంనగర్ లో బీజేపీది చరిత్రాత్మక విజయం.. నెక్స్ట్ టార్గెట్ అదేనన్న బండి సంజయ్
-

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేషుడి విగ్రహాన్ని ఉంచవచ్చా
-

AP బడ్జెట్ 2026-27 : రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్
-

సంచలన నిర్ణయం తీసుకున్నా బీర్ కంపెనీ: ఉద్యోగులకు బిగ్ షాక్..!















