Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తీవ్ర మనస్తాపంతో వ్యాపారి మృతి

తీవ్ర మనస్తాపంతో వ్యాపారి మృతి

📰 Generate e-Paper Clip

*తీవ్ర మనస్తాపంతో వ్యాపారి మృతి…

మేడారం జాతరలో నష్టమే ప్రాణం తీసిందా.?* 

నంద్యాల/ఆత్మకూరు, ఫిబ్రవరి 19, (సీమకిరణం న్యూస్):

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఖల్లా వీధికి చెందిన కవ్వ బన్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న *షేక్ బాషా* అనే వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.

 

 *ఘటన వివరాల్లోకి వెళ్తే…* 

మృతుడు షేక్ బాషా గత కొంతకాలంగా కవ్వ బన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలో వ్యాపారం నిమిత్తం వెళ్లిన కవ్వ బన్ వ్యాపారులకు , అక్కడ వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు ( *ఇష్యూ* ) ఎదురయ్యాయి. అప్పటి నుండి కవ్వబన్ వ్యాపారంపై వ్యతిరేకత రావడంతో వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.

 

*కుంగుబాటుతో గుండెపోటు* :

ఆర్థిక సమస్యలు పెరగడం, చేసిన వ్యాపారం దెబ్బతినడంతో బాషా గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మనసులో బాధను దిగమింగుకుంటూ గడుపుతున్న ఆయనకు, ఈరోజు మధ్యాహ్నం గం. 1:30 నిమిషాలకు ఒక్కసారిగా గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య వ్యాపారి ఇలా అకస్మాత్తుగా మరణించడంతో ఆయన కుటుంబం వీధిన పడింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular