Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణలైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణా కొత్త రికార్డ్.. రేవంత్ రెడ్డి ఫోకస్! | 23వ బయోఏషియా...

లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణా కొత్త రికార్డ్.. రేవంత్ రెడ్డి ఫోకస్! | 23వ బయోఏషియా 2026కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో తెలంగాణ లైఫ్ సైన్సెస్‌లో కొత్త రికార్డును నెలకొల్పబోతోంది.

📰 Generate e-Paper Clip


తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ లో కొత్త రికార్డును సృష్టించబోతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సుకు వేదిక. హైటెక్స్ వేదికగా రెండురోజుల పాటు జరిగే సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్‌ను మార్చాలని సంకల్పించిన రేవంత్ రెడ్డికి ఈ సదస్సు ప్రాధాన్యత అంశంగా మారింది.

ఏఐ, ఆటోమేషన్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాలపై ప్రభావంపై సదస్సు

ఈ ఏడాది సదస్సును ‘టెక్‌బయో అన్‌లీష్డ్ – ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు’ (TechBio Unleashed – AI, Automation & the Biology Revolution) అనే థీమ్ తో ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆటోమేషన్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే అంశం పైన ఈ సదస్సులో లోతుగా చర్చిస్తారు.

23వ బయోఏషియా 2026కి హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో తెలంగాణ లైఫ్ సైన్సెస్‌లో కొత్త రికార్డును నెలకొల్పబోతోంది.

ఈ సదస్సుకువిదేశాల నుండి ఎక్స్‌పర్ట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, అనంతరం సదస్సును ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికైన ఎక్స్‌పర్ట్‌లు కూడా పాల్గొంటారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, అమ్జెన్ (USA) చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ హోవర్డ్ వైచాంగ్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా సదస్సుకు హాజరవుతున్నారు.

50కి పైగా దేశాల నుండి 4,000 మంది ప్రతినిధులు

వీరితో పాటు 50కి పైగా దేశాల నుండి సుమారు 4,000 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు మరియు ఫార్మా దిగ్గజాలు ఈ వేదికపై తమ అభిప్రాయాలను, నూతన ఆవిష్కరణలను పంచుకోనున్నారు. ఈ సమాచారం భాగస్వామ్యం హైదరాబాద్‌ను ప్రపంచ ఆరోగ్య రంగంలోనే ప్రాథమిక మార్పులకు కేంద్రంగా నిలబెట్టేందుకు దోహదపడుతుంది. రెండు రోజులపాటు లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి జరిగే ఈ సదస్సులో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి తగ్గట్టు రోడ్ మ్యాప్

ప్రధానంగా నెక్స్ట్ జనరేషన్ బయో లాజిక్స్, ఔషధాల తయారీలో వస్తున్న నూతన మార్పులు, ఏఐఐ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ఎనలిటిక్స్, ఏఐ సాయంతో రోగనిర్ధారణ, చికిత్స వంటి విషయాలపై లోతైన విశ్లేషణలు జరుపుతారు. హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యానికి తగ్గట్టు రాష్ట్రాన్ని ఒక ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం గా మార్చడానికి అవసరమైన రోడ్ మ్యాప్ పైన చర్చిస్తారు.

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు స్థానం

పరిశోధన, కొత్త వ్యాధుల చికిత్సకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ప్రపంచ ఆరోగ్య ప్రభావం వంటి అనేక అంశాల పైన లోతుగా చర్చిస్తారు. ఈ చర్చల ద్వారా హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన నగరం సుస్థిరం కానుంది. అతిపెద్ద టెక్ బయో హబ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ సదస్సును ఇక్కడ నిర్వహించడం వల్ల తెలంగాణకు లబ్ధి చేకూరనుంది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular