Thursday, April 23, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్ఎర్ర పట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎర్ర పట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఎర్ర పట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి 

 

సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ

 

అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్ కి ఎర్ర మట్టి తరలింపు చర్యలు తీసుకోవాలి : సిపిఐ

 

వెల్దుర్తి, ఫిబ్రవరి 12, (సీమకిరణం న్యూస్):

 

అక్రమంగా ఎర్ర పట్టి తరలింపు వెల్దుర్తి మండలంలోని సూదేపల్లె గ్రామ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అక్రమంగా ఎర్రమట్టి తరలింపు కు ఎలాంటి పర్మిషన్ లేకుండా రాత్రుల పూట ఎర్ర మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ కి తరలింపు చేస్తున్నారని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము నల్లబట్టి రైతులకు తోలుకోమని పర్మిషన్ ఇస్తే కొంతమంది అక్రమ దారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వెంచర్లకి తరలిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న కూడా అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు నిద్రమత్తులో ఉంటూ పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటని వారన్నారు. తక్షణమే ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఎర్ర పట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular