Friday, March 6, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పేదలకు వరం -- సాయి బాలాజీ నర్సింగ్ హోమ్

పేదలకు వరం — సాయి బాలాజీ నర్సింగ్ హోమ్

📰 Generate e-Paper Clip

పేదలకు వరం — సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఉచిత వైద్య శిబిరం..!!

 

నంద్యాల ప్రతినిధి , ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్) :

పేదలు,మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పెద్ద ఊరటగా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ మరోసారి ముందుకొచ్చింది. సంజీవనగర్‌లో ఫిబ్రవరి 8 వ తేదీ ఆదివారం నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరం ప్రజలకు ఆశాజ్యోతి కానుంది..!!

ఖరీదైన వైద్య పరీక్షలకు వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్న సామాన్య ప్రజల కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం..!!

మధుమేహం బీపీ,గుండె జబ్బులు,కంటి,కిడ్నీ,నరాల సమస్యలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి సలహాలు ఇవ్వనున్నారు..!!

ప్రత్యేకంగా ECG,2D ఎకో వంటి ఖరీదైన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందించడం ఈ శిబిరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది..!!

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన సీనియర్ వైద్యులు ప్రత్యక్షంగా పాల్గొని రోగులను పరిశీలించనున్నారు..!!

ప్రైవేట్ ఆసుపత్రులు లాభాల దిశగా పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో,మానవత్వమే లక్ష్యంగా సాయిబాలాజీ నర్సింగ్ హోమ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం అభినందనీయం..!!

ఈ కార్యక్రమానికి “డా. యం.హరినాథ్ రెడ్డి”(MD,జనరల్ మెడిసిన్) ప్రధాన వైద్యులుగా వ్యవహరిస్తున్నారు..!!

ఈ శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నర్సింగ్ హోమ్ నిర్వాహకులు కోరుతున్నారు..!!

వివరాలకు సంప్రదించండి :  08514-247666,73862 69669.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular