Thursday, November 5, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోషకాహారంపై చైతన్యం!

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోషకాహారంపై చైతన్యం!

📰 Generate e-Paper Clip

సుస్థిర ఆహార విధానాలపై కర్నూలు GGHలో అవగాహన కార్యక్రమం!

 

 

ఆహార వృథాను అరికట్టండి.. చిరుధాన్యాలు, స్థానిక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి!

 

 

కర్నూలు వైద్యం, నవంబర్ 04 (సీమకిరణం న్యూస్):

 

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో సుస్థిర జీవన విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘BRICS Sustainable Lifestyle Week’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇందులో భాగంగా సోమవారం “Adopt Sustainable Food Systems” (సుస్థిర ఆహార విధానాల అమలు) అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ M.V. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆహార వృథాను అరికట్టడం, ఆహార వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. అలాగే రోగుల బంధువులు, సహాయకులకు తృణధాన్యాలు (మిల్లెట్స్), స్థానికంగా లభించే కాలానుగుణ ఆహార పదార్థాల ప్రాముఖ్యత, వాటిలోని పోషక విలువలపై ప్రత్యేక పోషకాహార కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవరచుకోవడంతో పాటు ఆహార వృథాను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, రోగుల సహాయకులు విశేషంగా పాల్గొని అవగాహన పొందారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సుస్థిర ఆహార విధానాలు ఎంతో అవసరమని ఈ కార్యక్రమం ద్వారా సందేశం అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular