Friday, November 6, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సుస్థిర ఆహార విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన!

సుస్థిర ఆహార విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన!

📰 Generate e-Paper Clip

సుస్థిర ఆహార విధానాలపై వైద్య విద్యార్థులకు అవగాహన!

 

 

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విద్యార్థుల ప్రతిజ్ఞ

 

 

పోషకాహారం, పర్యావరణ పరిరక్షణతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం : ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ

 

 

కర్నూలు వైద్యం, నవంబర్ 04, (సీమకిరణం న్యూస్):

 

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం, మంచి ఆహారపు అలవాట్లు ఎంతో అవసరమని కర్నూలు మెడికల్ కాలేజీ అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు తమ జీవితాల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడంతో పాటు, ప్రజల్లోనూ వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణతో పాటు ప్రకృతి వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. బుధవారం BRICS Sustainable Lifestyle Week కార్యక్రమంలో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీలోని విద్యార్థుల హాస్టల్, న్యూ లెక్చరర్ గ్యాలరీలో “సుస్థిర ఆహార విధానాలను అలవర్చుకుందాం” అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను జీవితంలో భాగంగా చేసుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోషక విలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవడం, చిరుధాన్యాలు (మిల్లెట్స్), స్థానిక ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వడం, తాజా కాలానుగుణ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం, ఆహార వృథాను అరికట్టి ఆహారాన్ని గౌరవించడం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడే సుస్థిర ఆహార విధానాలను పాటించడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని BRICS Sustainable Lifestyle Week నోడల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైద్య విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular