Friday, November 6, 2026
ads
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

📰 Generate e-Paper Clip

వెల్దుర్తిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట పోలీస్ బందోబస్తు

 

— ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బందితో భద్రత

 

వెల్దుర్తి నజీర్, నవంబర్ 04 (సీమకిరణం న్యూస్):

 

రేపు వెల్దుర్తి మండలంలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి లేదా రూట్ మొబైల్ పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. వెల్దుర్తి మండలంలో ఎన్నికల భద్రత కోసం ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular