ఎస్వీ మోహన్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, మేయర్ అభ్యర్థి సుశీల
మాజీ సీఎం వైఎస్ జగన్, ఎస్వీ మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపిన మేయర్ అభ్యర్థి సుశీల
కర్నూలు ప్రతినిధి, అక్టోబర్ 16 (సీమకిరణం న్యూస్):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, కర్నూలు నగర మేయర్ అభ్యర్థి సుశీల మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కర్నూలు నగర మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి మేయర్ అభ్యర్థి సుశీల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి మరియు ఎస్వీ మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలులోని ఎస్వీ మోహన్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై కాసేపు చర్చించారు.

