స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘ చర్చ
నంద్యాల ప్రతినిధి, అక్టోబర్ 15, (సీమకిరణం న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ను నంద్యాల లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు మరియు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు సమన్వయంతో కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత బలోపేతం చేయాలని వారు చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కొప్పుల శివ నాగిరెడ్డి , మునగాల విశ్వనాథ్ రెడ్డి, పబ్బతి వేణు తదితరులు పాల్గొన్నారు

