కర్నూలులో ఎంఎస్‌ఆర్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహకు ఆహ్వానం
కర్నూలు క్రైమ్, అక్టోబర్ 09, (సీమకిరణం న్యూస్):
కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలో అక్టోబర్ 11వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న ఎంఎస్‌ఆర్ రెసిడెన్సీ ప్రారంభోత్సవానికి కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ్ సింహను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఐ విక్రమ్ సింహను కలిసి పుష్పగుచ్ఛం అందించి కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంఎస్‌ఆర్ లాడ్జ్ యజమాని మిన్నల్ల గారి సురేంద్ర పి. కోటకొండ, మహర్షి మీడియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ వార్త మద్దులేటి మారెళ్ళ, ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన సీపీఎం నాయకుడు రోశయ్య, మాస్ లీల కృష్ణ (కోడుమూరు) పాల్గొన్నారు.

