Monday, August 24, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్వెల్దుర్తిలో మట్కా, సారాయి వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

వెల్దుర్తిలో మట్కా, సారాయి వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

📰 Generate e-Paper Clip

వెల్దుర్తిలో మట్కా, సారాయి వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం

వెల్దుర్తి, ఆగస్టు 24 (సీమకిరణం న్యూస్):

వెల్దుర్తి పట్టణంలో మట్కా, నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ టెంపుల్ రోడ్డులోని గంగమ్మ గుడి వద్ద దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారాతో పాటు మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ప్రజల నుంచి మట్కా డబ్బులు వసూలు చేసి, సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ మట్కా యాప్‌లో నగదు పెట్టి, మిగిలిన మొత్తాన్ని సొంత అవసరాలకు వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మట్కాతో పాటు నాటుసారా విక్రయిస్తున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. పట్టుబడిన రామకృష్ణ వద్ద 7 లీటర్ల నాటుసారా, రూ.14,910 నగదు, ఒక మట్కా చీటీ, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రామానాయుడు వద్ద 6 లీటర్ల నాటుసారా, రూ.15,140 నగదు, రెండు మట్కా చీటీలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మూడో నిందితుడు పరమేష్ వద్ద 5 లీటర్ల నాటుసారా, రూ.14,000 నగదు, ఒక సెల్‌ఫోన్, ఒక మట్కా చీటీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా ముగ్గురి వద్ద నుంచి 18 లీటర్ల నాటుసారా, రూ.44,050 నగదు, నాలుగు మట్కా చీటీలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్ఐ నరేష్ తెలిపారు. మట్కా, అక్రమ నాటుసారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular