వెల్దుర్తిలో మట్కా, సారాయి వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం
వెల్దుర్తిలో మట్కా, సారాయి వ్యాపారులపై పోలీసుల ఉక్కుపాదం వెల్దుర్తి, ఆగస్టు 24 (సీమకిరణం న్యూస్): వెల్దుర్తి పట్టణంలో మట్కా, నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు సోమవారం మధ్యాహ్నం ఎల్లమ్మ టెంపుల్ రోడ్డులోని గంగమ్మ గుడి వద్ద దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారాతో పాటు మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ప్రజల నుంచి మట్కా డబ్బులు వసూలు చేసి, సెల్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్ మట్కా యాప్‌లో నగదు పెట్టి, మిగిలిన మొత్తాన్ని సొంత...