ఓర్వకల్ పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఓర్వకల్, ఆగస్టు 15 (సీమకిరణం న్యూస్):

ఓర్వకల్ మండలంలోని పి ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓర్వకల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ సజీవ రాజు జాతీయ పతావిష్కరణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రామచంద్రారెడ్డి జాతీయ నాయకుల కృషిని వివరిస్తూ విద్యార్థులు స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దేశాభివృద్ధికి పాటుపడే మంచి పౌరులుగా ఎదగాలని తెలిపారు. భావి భారత పౌరుల బాధ్యత, దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి తదితర అంశాలపై గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు సందేశాన్ని అందించారు. పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ చాటి ప్రథమ ద్వితీయ స్థానాలను పొందిన విద్యార్థులకు, గత సంవత్సరం 9వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు దాతలు, గ్రామ పెద్దలు నగదు బహుమతులను అందించారు. పదవ తరగతిలో గణితంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి మరియు సైన్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి ఉపాధ్యాయిని వనజాక్షి నగదు బహుమతులను అందించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దాతలు, గ్రామ పెద్దలు జనార్ధన రెడ్డి , లక్ష్మీకాంతరెడ్డి, గోవిందరెడ్డి, కాంతయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది మనోహర్, నాగన్న, వరలక్ష్మి , సుజాత, శ్రీనివాసులు, సుదర్శన్ రెడ్డి, మునిస్వామి, విజయ ప్రసాద్, హరి ప్రసాద్ , భ్రమరాంబ, కృష్ణవేణమ్మ, పద్మజ, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

